ఉన్నతమైన సురక్షితమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన వైద్య సేవలు అందించే ప్రక్రియకు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి చక్కటి వేదిక కానుంది . నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టి.ఎం.సి., ఎన్.సి.జి నవ్యతో కలిసి సాంకేతిక పరిష్కారాల ద్వారా క్యాన్సర్ కేర్ వైద్య సేవలు బలోపేతం చేయడానికి సహకరిస్తుందనీ హామీబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహాన్ శెట్టి వెల్లడించారు.
జి.జీ.హెచ్. క్యాన్సర్ వార్డులో రేడియాలజీ ఆంకాలజి విభాగాధిపతి డాక్టర్ పి. శ్రీనివాసన్ అధ్యక్షతన నేషనల్ క్యాన్సర్ కేర్ గ్రిడ్ పైలట్ ప్రాజెక్టు నవ్య ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న వైద్యసేవలు అనుబంధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో క్లినికల్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, క్యాన్సర్ రోగులకు మార్గదర్శక ఆధారిత సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యం జీజీహెచ్ కు కలగడం గర్వకారణం అన్నారు.

