గత ఏడాది సర్రేలో కెనడియన్ పౌరుడు, ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చినందుకు భారత ప్రభుత్వం నియమించిన హిట్ స్క్వాడ్‌లో భాగమని ఆరోపించిన ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు ఒక నివేదకలో పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో ముగ్గురిపై అభియోగాలు మోపినట్లు వెళ్లడించారు. CTV న్యూస్ ఒక సీనియర్ ప్రభుత్వ మూలాన్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొంది.
సర్రే కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం… నిందితులు కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్ నిజ్జార్ కేసులో ఫస్ట్ డిగ్రీ హత్య, కుట్ర ఆరోపణలను ఎదుర్కొన్నారు. అల్బెర్టా, అంటారియో అనే రెండు ప్రావిన్స్‌లలో జరిగిన ఆపరేషన్లలో నిందితులను అరెస్టు చేసినట్లు కెనడియన్ మీడియా నివేదించింది. అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు 2021 తర్వాత తాత్కాలిక వీసాలపై కెనడాకు వచ్చిన భారతీయ పౌరులు, వారిలో కొందరు విద్యార్థి వీసాలపై ఉన్నట్లు వారు తెలిపారు.

