ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా రాజమండ్రి వై.ఎస్.ఆర్.సీ.పీ. ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు అను బాబు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ వైద్య నగర్ క్యాంపు కార్యాలయం లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వై.సి.పి. జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను బాబుకను శాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ముద్దాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో కాపు సంక్షేమానికి కట్టుబడి పని చేస్తానని అన్నారు. ఈ కార్యాక్రమానికి వై.ఎస్.ఆర్.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి యువ కాపునాడు కన్వీనర్ లింగం రవి, రూరల్ మండల యువ కాపునాడు అధ్యక్షుడు బిందాన సురేష్, జిల్లా వైఎస్ఆర్సిపి దివ్యాంగుల సెల్ అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

