సేవా భారతి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుండి రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య నమస్కారాల పోటీ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం రధసప్తమి సందర్బంగా కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో 27వ సూర్య నమస్కారాల పోటీలు ఉదయం 6 గంటలకు ప్రారంభించడం జరిగింది. కాకినాడ నగరం చుట్టు ప్రక్కల గ్రామీణ ప్రాంతాలలోని 40 ఉన్నత పాఠశాల నుండి సుమారు 423 మంది ఉత్సాహంగా పోటీపడ్డారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర రావు, ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘం రాజమహేంద్రవరం విభాగ ప్రచారకులు సోమశేఖర్ పాల్గొన్నారు. అట్లూరి శివరామకృష్ణయ్య మాట్లాడుతూ… సేవా భారతి ప్రతి సంవత్సరం ఈ సూర్య నమస్కారాల పోటీలు నిర్వహిస్తున్నామని ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కాకినాడ ఎల్బీనగర్ లో నచికేత అనే పేరుతో ఉచిత ఆవాసం నడుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య శర్మ, సేవా భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావి విశ్వనాథం, సామాజిక సమరసితా వేదిక రాష్ట్ర సహా సంయోజకులు రాజా రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

