డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద జరుగుతున్న మంచి భోజన కార్యక్రమం శనివారం జరిగింది. గత ఐదు వారాలుగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఐదవ శనివారం కూడా కొనసాగింది. నాలుగు రకాల స్వీట్స్, గారులు, వెజిటేబుల్ బిర్యానీ, పులిహార, మూడు రకాల కూరలు, సాంబార్ మంచి పెరుగుతో విందు భోజనంలా సాగింది. దాదాపు 250 మందికి పైగా విందు భోజనం ఆరగించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోటయ్య స్వీట్స్అధినేత సీ.హెచ్. రామ్ కుమార్, జై కృష్ణ మోహన్ అమ్మాయి వైష్ణవి, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు మంగా వెంకట శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో ఐదవ శనివారం ఘనంగా డొక్కా సీతమ్మ అన్నధాన కార్యక్రమం…

