Exclusive

కాకినాడ లో డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి అన్నదాన సిభిరం…

dokka 2

కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఘనంగా జరిగింది. ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విందు భోజనం మాదిరిగా బూరి, బెల్లం జాంగ్రీ, కోటయ్య కాజా, బందర్ నేతి మిఠాయి నాలుగు రకాల స్వీట్లు, పులిహార, వివిధ రకాల కూరలు, సాంబారు, పెరుగుతో అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవ సంఘం చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కస్తూరి పట్టాభి రామయ్య, కరప తాతీయులు, సంఘ సేవకురాలు, చార్లీ, అనసూయ రాజకుమారి పిడకా శేషు, తదితరులు వడ్డించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.