Political

కాకినాడ రూరల్ సీటును శెట్టిబలిజలకే కేటాయించాలి…

WhatsApp Image 2024-03-02 at 4.41.18 PM

కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సీటును రాజకీయ ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన శెట్టిబలిజ సామాజిక వర్గీయులకే కేటాయించాలని శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు వారు కాకినాడలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసం శెట్టి భీమరాజు, సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణలు విలేకరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు గత కొంతకాలంగా శెట్టిబలిజ సామాజిక వర్గీయులకు ఏదో ఒక పార్టీ కేటాయిస్తుందని ఈసారి అది జరగలేదన్నారు. కావున రూరల్ సీటును శెట్టిబలిజలకే కేటాయించాలని అలాగే ఇతర నియోజకవర్గాల్లో బీ.సీ. సామాజిక వర్గానికి కేటాయిస్తే వారికే తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కాకినాడ రూరల్లో శెట్టిబలిజలకు సీటు కేటాయించని పక్షంలో తామే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి స్వతంత్రంగా పోటీ చేసి తమ ఓట్లను తామే వేసుకుంటామంటూ నాగేశ్వరరావు, భీమరాజు, గోపాలకృష్ణలు చెప్పారు. ఈ సమావేశంలో బీసీ వెల్ఫేర్, జన జాగృతి నాయకులు రాయుడు సుధాకర్, మేడిశెట్టి లక్ష్మణరావు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.