కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని రాజకీయ పార్టీలు శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ రామారావు పేటలో ఉన్న శెట్టిబలిజ సంఘ భవనంలో శెట్టిబలి సంఘ నాయకులు కండిపల్లి వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, రాయుడు దుర్గ, వాసంశెట్టి త్రిమూర్తులు, కాకరపల్లి చలపతిరావులు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలో ఒక్క బీ.సీ. సామాజిక వర్గీయులు ఎమ్మెల్యేలుగా లేరన్నారు. తమకి కాకినాడ రూరల్ సీటును కేటాయించాలని లేనిపక్షంలో అన్ని నియోజకవర్గాలలో స్వతంత్రలుగా పోటీ చేసి ఆయా పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వతంత్రులుగా స్వతంత్ర ఎమ్మెల్యేలుగా నలుగురు గెలిచిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.

