ఆధునికతకు అర్థం పట్టే రీతిలో కాకినాడ ‘రంగీత’ షోరూం ప్రముఖ నటి మేఘన లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రంగీత ఫ్యాషన్ బ్రాండ్స్ తో అందాల ముద్దుగుమ్మలు ప్రదర్శించిన క్యాట్ వాక్ అందరినీ అలరించింది. ఈ స్టోర్ రాష్ట్రంలో తమ రెండవ కేంద్రమని స్టెల్లారో బ్రాండ్ సీ.ఈ.వో. హిమాన్షు చక్రభర్తి తెలిపారు.స్టెల్లారో బ్రాండ్స్ క్రింద డైరెక్ట్-టు-కన్స్యూమర్ (డి2సి) భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ అయిన రంగిత, తన రెండవ ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌ను గ్రాండ్ ఓపెనింగ్ జరిగిందని, స్తెల్లారో నాణ్యత, నమ్మకం ముద్రను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు విస్తరించిందన్నారు. కస్టమర్ల పట్ల మా అంకితభావం, విభిన్న ఉత్పత్తుల శ్రేణితో సరిపోలడం తమ సంస్థ ప్రత్యేకత అన్నారు. రంగిత షోరూం లో ₹399 నుండి ₹1499 వరకు ఉంటాయనీ బ్రాండ్ అధిక నాణ్యత, ఫ్యాషన్ ఫార్వర్డ్ దుస్తులకు ప్రాధాన్యతనిస్తూనే ఉందనీ, ఇది మహిళల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని జరుపుకుంటుందనీ తెలిపారు.
కాకినాడ ‘రంగీత’ షోరూం ప్రారంభోత్సవంలో ప్రముఖ నటి…

