కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం అధిక శాతంలో పేదలు హాజరవుతారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీ.సీ. ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆసుపత్రి సి.ఎస్.ఆర్.ఎం.ఓ. పుష్కరరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ… కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాదిమంది రోగులు వివిధ వైద్య సేవల నిమిత్తం వస్తుంటారని అక్కడ అవసరమైన ఎమ్మారై స్కానింగ్ మూడున్నర సంవత్సరాల నుంచి పని చేయడం లేదన్నారు.
ఈ స్కానింగ్ లేక వైద్యులు రోగులకు తగు అవసరమైన సేవలు అందించలేకపోతున్నారని అందువల్ల వాళ్ళు మరణాలకు గురవుతున్నట్లు చెప్పారు. తక్షణమే ఎమ్మారై స్కానింగ్ కొత్తది ఏర్పాటు చేసి వైద్య సేవలను పేదలకు అందించాలని పుష్కరరావుకు వాసంశెట్టి సూచించారు. వినతిపత్రాన్ని ఉన్నత స్థాయి వైద్యాధికారులకు తగు చర్యల నిమిత్తం పంపిస్తానని పుష్కరరావు వాసంశెట్టి బదులిచ్చారు.

