Viral

కాకినాడ జిల్లాలో ఘోరం… దళిత యువకుడిపై దాడి…

jilla

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవములో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన చాపల అజయ్ కుమార్, కాపు కులానికి చెందిన చక్ర లక్ష్మి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆగస్టు ఒకటి సాయంత్రం 6 గంటల సమయంలో చక్ర లక్ష్మీ కాలేజీ అయిపోయిన తర్వాత అజయ్ కుమార్ తో కలిసి బయటికి వెళ్లింది. అయితే రెండో తారీకు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చక్ర లక్ష్మిని ఒప్పించి, వారి ఇంటి వద్ద దింపాడు.

తనతో రాత్రంతా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను హింసిస్తున్నారని స్నేహితుల ద్వారా తెలుసుకొని కుమార్ చక్ర లక్ష్మి ఇంటికి వెళ్లగా ఆమె తల్లిదండ్రులు తనను తాళ్ల తో బంధించి చిత్ర హింసలకు గురిచేయ్యటమే కాకుండా అడ్డుకొన్న బందువులను కూడా కొట్టి గాయపర్చారు. ఈ విషయం తెలిసిన పోలీసులు తనను విడిపించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచిరణ చేపట్టారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.