ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కే.బి.ఆర్ నాయుడు పర్యవేక్షణలో పి.సి.సి. చీఫ్ వై.ఎస్. షర్మిళ కాకినాడ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు కొన సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి తొలిసారిగా కాకినాడ వస్తున్న వై.ఎస్. షర్మిళకి కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీరించిన తరువాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతోత్సాహం చేసిందన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు ఆయన మరణానంతరం వై.యస్. వారసు రాలిగా షర్మిళ రావడం ఆంద్ర ప్రదేశ్ ప్రజలచేసుకున్న అదృష్టం అన్నారు.

