Exclusive

ఓటు నమోదు శిబిరాల ఏర్పాటు… -కలెక్టర్ డా. కృతికా-

WhatsApp Image 2023-12-01 at 6.33.13 PM

ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా… ఆయా నియోజకవర్గాలకు చెందిన ఈ.ఆర్.వో. లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల సీ.ఈ.వో. అన్ని జిల్లాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 పురోగతిని సమీక్షించారు. కాకినాడ జిల్లాలో ఎస్ఎస్ఆర్-2024కి సంబంధించి వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ సీ.ఈ.వో. కు వివరించారు. ప్రధానంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.