ఒడిశాలో గురువారం తీవ్ర వేడిగాలులు వీచాయి, ఝర్సుగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 43.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని అధికారులు తెలిపారు. బరిపడా 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, తర్వాత నువాపాడా 43.5 డిగ్రీలుగా, తాల్చేర్ 43.4 డిగ్రీలుగా, బౌధ్ 43.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలిపారు.
భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం డేటా ప్రకారం… కేంద్రపరా, కటక్ మరియు బోలంగీర్ పట్టణంలో గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు.
గజపతి, గంజాం, బాలాసోర్ మరియు మయూర్భంజ్ సహా తొమ్మిది జిల్లాలకు తీవ్రమైన వేడిగాలుల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లేటపుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.
