ఏలూరు జిల్లా ఏలూరులో 15వ డివిజన్న చిరంజీవి జస్ షెల్టర్ దగ్గర టీ.డీ.పీ. ప్రజా సంకల్ప యాత్రను ఆ పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్బంగాఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చెప్పే మాయమాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. టిడిపి – జనసేన కూటమికి వస్తున్న ప్రజాధరణను చూసి జగన్తో పాటూ వైసిపి నేతలకు వణుకు పుడుతోందన్నారు.
తరువాత ఇంటింటికి వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడంతో పాటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వారిలో చైతన్యాన్ని కలిగించారు. వైసిపి ప్రభుత్వ పాలనలో అన్నివర్గాలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్, ఏలూరు నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ బడేటి చంటి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
