ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా కార్పొరేట్లు, రాజకీయ పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాట్లకు సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ… దాఖలైన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ ద్వారా రాజకీయ పార్టీలకు భారీ విరాళాల కాంట్రాక్టుల మంజూరులో మనీ ట్రయల్, క్విడ్ ప్రోకోపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిట్ విచారణ జరిపించాలని పి.ఐ.ఎల్. లు డిమాండ్ చేశాయి.
సాధారణ చట్టం ప్రకారం తగిన పరిష్కార చర్యలు తీసుకునేందుకు పిటిషనర్లకు అవకాశం ఉందని సీ.జే.ఐ. డీ.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వారి ఫిర్యాదులను విచారించకపోతే లేదా మూసివేత నివేదికను దాఖలు చేస్తే, వారు హైకోర్టులను లేదా ఎస్సీని ఆశ్రయించవచ్చని పేర్కొంది.

