Exclusive

ఎన్నికల కమీషన్ అధికారులకు అభినందనలు తెలిపిన పౌరసంఘం…

WhatsApp Image 2024-05-14 at 8.42.12 PM

కాకినాడ జిల్లాలో యువకులు ఓటరు చైతన్యం చెందే దిశగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపడం వలన జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్ పకడ్బందీగా చేపట్టిన శాంతి భద్రతల నిర్వహణతో పోలింగ్ శాతం పెరిగిందని పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. కాకినాడ సిటీ లో 72 శాతం, రూరల్ లో 73శాతం, జిల్లాలో 75 శాతం పోలింగ్ జరగడం అత్యంత అభినందనీయమన్నారు. జె.ఎన్.టి.యు. లైబ్రరీ హాలులో ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేష్ జోగ్ పాల్ జిల్లా ఎన్నికల అధికారి నివాస్ లకు పౌర కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్ల పూడి రమణరాజు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేసారు.

ఓటరు చైతన్య ప్రచార వాహన యాత్రకు సహకరించిన అధికారులకు ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. పౌర సంఘం చేపట్టిన కరపత్రాల పంపిణీ స్వచ్ఛంద ఓటరు చైతన్య ప్రచార వాహనయాత్ర గురించి కలెక్టర్ నివాస్ ప్రత్యేక ఎన్నికల అధికారి జోగ్ పాల్ కి వివరించి ప్రశంసించారు. రూరల్ రిటర్నింగ్ అధికారి ఆర్.డి.ఓ. ఇట్ల కిషోర్, సిటీ రిటర్నింగ్ అధికారి, కమీషనర్ జె. వెంకట రావు, నగర డి.ఎస్.పి. కె. హనుమంతరావు పకడ్బందీగా ఎన్నికల సర్వీస్ నిర్వహించారని పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.