కాకినాడ సిటీ లో మెక్లారిన్ హై స్కూల్ ప్రాంగణంలో భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యి రిబ్బని కటింగ్ చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడలో ఈ ఎగ్జిబిషన్‌ను నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని కోరారు. కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారన్నారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జ్ సెట్ అందర్నీ ఆకర్షించిందని ఆయన అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల స్టాల్సులను ఏర్పాటు, పిల్లలు, పెద్దలను ఆకర్షించే విధంగా ఈ ఎగ్జిబిషన్ తయారు చేసినట్లు ప్రొప్రైటర్ నరసింహస్వామి తెలిపారు.
ఎగ్జిబిషన్ ఓపెనింగ్ లో కాకినాడ ఎమ్మెల్యే…

