క్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో బెయిల్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వేసిన తాజా పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి సీ.బీ.ఐ., ఈ.డీ. దాఖలు చేసిన కేసుల్లో సిసోడియా బెయిల్ పిటిషన్లను స్వీకరించేందుకు జూన్ 4న సుప్రీంకోర్టు నిరాకరించింది.
సిసోడియా తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ… ఈ కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలైన డిస్పోజ్డ్ పిటీషన్‌ను పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఛార్జ్ షీట్, ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, లింక్ చేయబడిన మనీలాండరింగ్ విషయంలో జూలై 3, 2024 లేదా అంతకు ముందు దాఖలు చేస్తామని దర్యాప్తు సంస్థల తరఫు న్యాయ అధికారి ధర్మాసనానికి తెలిపారు.

