ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. టీవి, రేడియో వార్తలు వినాలి, వార్తాపత్రికలు చదవి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటు ఉండాలి. నెత్తికి టోపి లేదా రూమాలు కట్టుకోవాలి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలి. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. తరుచుగా మంచి నీటిని తాగాలి. ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగడం మంచిది. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి తగు చికిత్స అందించాలి.
ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు…