కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ప్రసన్న విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంద్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో నాడు సిద్ధం నేడు సిద్ధం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబందించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు.
ఈ నెల 30న ఏలూరులో జగన్ కార్యక్రమం….
