కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి, అప్పటి కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగవర్ కి బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కాకినాడ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఈరోజు కాకినాడలో కార్మికుల సంక్షేమం కోసం 113 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఈ.ఎస్.ఐ.సి. హాస్పిటల్ అందుకు ఒక ఉదాహరణ అని అన్నారు.
ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభోత్సవం చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి బీ.జే.పీ. సీనియర్ నాయకులతో పాటు హాజరైన చిలుకూరు రామ్ కుమార్ మోడీకి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సాగి కాశి విశ్వనాథ్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి రావూరి సుధ, రాష్ట్ర మేధావిభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

