Political

ఇన్ని రిజర్వాయర్లున్నా రైతులు కష్టాలు తీరేదెపుడూ…

nagababu

శుక్రవారం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావాశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు విచ్చేసారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… మాడుగుల నియోజకవర్గంలో రైవాడ, పెద్దేరు, తారకరామ, పాలగెడ్డ, గొర్రిగెడ్డ, ఉరకగెడ్డ ఇన్ని రిజర్వాయర్లు ఉన్నా రైతులు సాగునీటికి ఎప్పుడూ కష్టాలు పడుతున్నారన్నారు.

కాలువలు అధ్వానంగా వుండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఆధునికీకరణ, మరమ్మతు పనుల కోసం ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపించడం ప్రభుత్వం మొండి చేయి చూపడం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా మారాయన్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.