ఇరాన్ శనివారం ఇజ్రాయెల్ పై వైమానిక దాడిని ప్రారంభించింది. ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణకు దారితీసింది. ఇరాన్ తన భూభాగం నుండి ఇజ్రాయెల్ రాష్ట్ర భూభాగం వైపు యూ.ఏ.వీ. లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రయోగాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి, వాటిని అడ్డుకోవడానికి మేము యునైటెడ్ స్టేట్స్, ఈ ప్రాంతంలోని మా భాగస్వాముల సన్నిహిత సహకారంతో పని చేస్తున్నామని అన్నారు. ఇంతలో, ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడిని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది. ఇరాన్ ఇజ్రాయెల్‌పై వైమానిక దాడిని ప్రారంభించిందని, ఇది కొన్ని గంటల్లో బయటపడే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులతో దాడి…
