నిజామాబాద్ లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ చెందిన బాలాజీ రావు తన కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం కాచిగూడలోని సుందరనగర్లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. బాలాజీరావు కుమార్తె 13 సంవత్సరార సీ.హెచ్. గౌరీ 8వ తరగతి చదువుతోంది. అయితే సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుందని తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దానితో మనస్తాపానికి గురయ్యి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో బయటికి వెళ్లిపోయింది. సెల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యలు పరిసర ప్రాంతాల్లో గాలించారు, కానీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో నుండి వెళ్లిపోయిన విద్యార్థిని… ఆంధోళనలో కుటుంభ సభ్యులు…
