ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి బైకు మండపేట నుండి ద్వారపూడి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానిక కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన పడాల అఖిల్ గా గుర్తించినట్లు వెళ్లడించారు. అతడు స్థానిక పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడని తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి…

