రాష్ట్రంలో 2019లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని అధికారానికి ముందు వాగ్దానం చేసిన వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని దాదాపు విస్మరించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రజా పోరు యాత్ర ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రథం 50 బిల్డింగ్స్ ప్రాంతంలోని వినాయక కేఫ్, రేచర్ల పేట ,ఆనంద్ భారతి గ్రౌండ్స్ ప్రాంతాలలో పర్యటించింది కార్యక్రమాన్ని ప్రజా పోరు యాత్ర కన్వీనర్ ముసలిగంటి సురేష్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రజారోగ్యాన్ని వై.ఎస్.ఎర్.సీ.పీ. ప్రభుత్వం తూట్లు పొడిచిందని ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వైద్య పరికరాలు కొరత ఒకపక్క కొనసాగుతుండగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిందని వాపోయారు. కార్పొరేట్ హాస్పిటల్లో వెయ్యి రూపాయలు దాటిన పేదవాడు ప్రతి వైద్య ఖర్చు వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే భరిస్తుందని వాగ్దానం చేసి నేడు ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోగ్యశ్రీ కార్డు నేడు చిత్తుకాగితంగా మారిపోయిందన గట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం, దిలీప్ కుమార్ సద నాని, కొండేటి గంగాధర్, ఏడిద కృష్ణ, పాల్గొన్నారు.
