సామర్లకోటలో ఒక ఆంబోతు బీభత్సం సృష్టించింది. కనబడిన వారందరిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని వీర్రఘవపురంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక ఆబోతు వీధుల్లోకి ప్రవేశించింది. రోడ్డుపై పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలు, బలుసులపాటకు చెందిన ఒక న్యాయవాది పెయ్యల చక్రవర్తి తో పాటు దారిన వెళుతున్న మరి ముగ్గురిపై అతి దారుణంగా దాడిచేసింది. ఆదాడిలో అయిదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దాడిలో వారు తీవ్రంగా గాయపడగా న్యాయవాది చక్రవర్తిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆంబోతు దాడిలో అయిదుగురికి తీవ్ర గాయాలు

