
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పి.కె రావుని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పినిపే విశ్వరూప్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్సి ప్రభుత్వంలో అందరికీ ప్రాధాన్యత చేకూరుతుందని కొనియాడారు. మంత్రితో పాటు తుని నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులున్నారు.

