ఆంధ్ర ప్రదేశ్ ప్రజల రోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమ్ములుచేస్తొదని… తాజాగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి బిపి షుగర్ తో పాటు 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి ఆయా గ్రామాలలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించినప్పుడు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులలో వైద్యం అందించలేని వ్యాధులకు , నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నడిపూడి గ్రామంలో నిర్వహించిన జగన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో చర్మవ్యాధి నిపుణులు, కంటి వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు వృద్ధులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి జడ్పిటిసి పందిరి హరి, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు,అధికారులు,వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల రోగ్యమే లక్ష్యంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం… రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్

