
కాకినాడ రూరల్ వలసపాకల పంచాయితీ పరిధిలోని బాలాజీనగర్ రోడ్లు జలమయమయ్యాయి. గత కొన్నేళ్లుగా ఖాళీ స్థలాల్లో నిల్వఉన్న మురికినీరు వీధుల్లోనికి రావటంతో ఆ ప్రాంతం దుర్గంధంగా తయారైంది. రోడ్లపై నిలిచిపోయిన నీరు వెళ్లేందుకు మార్గం లేకపోడంతో ఆ ప్రాంతంవారు మురికినీటి నుంచే రాకపోకలు సాగించకతప్పడంలేదు. సంభందిత పంచాయితీ అధికారులకు విన్నవించినప్పటికీ ఎవరూ పట్టంచుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
