Exclusive

ఆ పార్టీలను ఓడించడమే ఆర్.పి.ఐ అంబేద్కర్ లక్ష్యం…

WhatsApp Image 2024-02-04 at 4.53.16 PM

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశం విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్లాల్ పాటిల్ పాల్గొని ప్రసంగిస్తూ, దేశంలో బీ.జే.పీ. ని రాష్ట్రంలో బి.జె.పి. కి సపోర్ట్ చేసే పార్టీల్ని ఓడించడమే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) లక్ష్యంఅన్నారు. దీనికోసం కలిసొచ్చే పార్టీలతో జతకట్టడానికి సిద్ధమన్నారు.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని పార్లమెంటు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గౌతమ్ బాబు ప్రసంగిస్తూ… పార్టీ విధివిధానాలు వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభిమానులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ గోజపాల్, జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్, జాతీయ కోశాధికారి కుర్రవర్లాల్ రామ్ టెక్, దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులుపి అంజయ్య,పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.