లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. సమావేశానికి సంబంధించిన నిర్దిష్ట ఎజెండాను బహిర్గతం చేయనప్పటికీ, ఒమన్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరియు ఇరాన్ యొక్క చబహార్ పోర్ట్ కోసం క్రెడిట్ లైన్‌ను $250 మిలియన్లకు పెంచడం వంటి అనేక ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చని వర్గాలు తెలిపాయి.
గత వారం క్రెడిట్ లైన్ ఎల్.ఓ.సి. ని మెరుగుపరచడానికి వ్యూహాలను చర్చించడానికి ఉన్నత స్థాయి అంతర్-మంత్రిత్వ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలిపింది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన చర్చలు జరిగిన ఒమన్‌తో ఎఫ్.టి.ఎ. పై చర్చలు చివరి సమావేశంలోనే జరగాల్సి ఉందని అయితే ఎటువంటి నిర్ణయం ప్రకటించబడలేదని వెళ్లడించింది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం పరిమితులను ఎదుర్కొంటుంది. అయితే అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఏదైనా ప్రకటన తప్పనిసరిగా ఎన్నికల సంఘం ఈ.సీ. నుండి ఆమోదం పొందాలి. ఎన్నికల ప్రక్రియల మధ్య పాలనను నిర్లక్ష్యం చేయవద్దని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

