అనకాపల్లి ఎన్డీఏ ఎన్నికల సభను ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అవినీతి మంత్రమయితే.. భారతీయ జనతా పార్టీది అభివృద్ధి మంత్రమని.. పేర్కొన్నారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్, లో కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తూ ప్రజలను అడ్డంగా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న జగన్ ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేయలేకపోయాడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని నొక్కి చేప్పారు.
అవినీతే వై.సీ.పీ. అజెండా… -ప్రధాని మోదీ-

