ఎన్నికలు దగ్గరపడడంతో అన్ని జిల్లాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఒక్కఅవకాశం ఇస్తే అవినీతి రహిత సమాజం నిర్మిస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా అమలాపురం రూరల్ మండలం బండారులంక లో ప్రజలును కలిసి విజల్ గుర్తుకు ఓటు వేసి శ్యామ్ ను గెలిపించాలని కోరారు. మహిళలు హారతులతో శ్యామ్ కుమార్ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
అవినీతి రహిత సమాజం నిర్మిస్తాను… -పరమట శ్యామ్ కుమార్-

