హైదరాబాద్ లో ఘోర సంఘటన జరిగింది. బండ్లగూడలో సోహెల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను ప్రేమించి వివాహమాడినందుకు జైలుకు వెళ్లాడు. అయితే ఇటీవల అతడు జైలు నుంచి బయటికి వచ్చిన నేపథ్యంలో అమ్మాయి కుటుంబ సభ్యులు కొడుకు పుట్టాడంటూ చెప్పారు. వచ్చి చూడవా అంటూ ఇంటికి పిలిచారు. అయితే ఎంతో సంతోషంగా వెళ్లిన యువకుడిని గదిలో నిర్బంధించి నానా చిత్రహింసలు చేసారు. సమాచారం తేలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆ యువకుడిని రక్షించారు. సోహెల్ పోలీసులకు వీడియో కాల్ చేయడంతో ఈ సమాచారం తెలిసిందని అధికారు తెలిపారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కు కారణమయిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వారు తెలిపారు.
అల్లుడిని బంధించి చిత్రహింసలు పెడుతున్న అత్త…!!!

