ఎన్నికలకు ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మామీల దృష్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కే. రేవంత్ రెడ్డి అమలుచేసిన ఆరు హామీల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించడానికి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి అర్హులయిన వారిని గుర్తించడమే ప్రజాపాలన లక్ష్యమని ఆయన అన్నారు. 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన ఆధ్వర్యంలో ఈ గ్రామసభలను నిర్వహిస్తామని అన్నారు.
అర్హులైన వారికి 6 పథకాలు అమలు… -తెలంగాణ సీఎం-

