భారత జనతా పార్టీతో పొత్త పై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఢిల్లీ చేరుకొన్న తరువాత రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారని తెలిపారు. పొత్తు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఏ.పీ. లోని బీ.జే.పీ. నేతలు పురందేశ్వరి, సోము వీర్రాజుతో జే.పీ. నడ్డా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. టీ.డీ.పీ. ఆఫర్ చేసే సీట్లకు బీ.జే.పీ. ఓకే అంటే.. పొత్తు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు.
అమిత్ షాతో చంద్రబాబు భేటీ…

