అమలాపురంలోని 2016 సంవత్సరంలో ఒక స్థలానికి సంబంధించి వివాదంలో ప్రధాన ముద్దాయి రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంనకు చెందిన తోట పుండరీకాక్షయ్యలు (బాబీ)తో పాటు 50 మందిపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబందించి వాదోపవాదాలు విన్న అనంతరం అమలాపురం ఒకటవ అసిస్టెంట్ సెషన్స్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది.
ఈ కేసును న్యాయవాది అబ్బిరెడ్డి సురేష్ వాదనలు విన్న కోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు వెలువడింది. దీనికి సంబంధించి వివరాలను వెల్లడించారు. 2016లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివాదంలో తాను లేనని అయినా తనపై పోలీసులు కేసు నమోదు చేశారని బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు తాను వాయిదాల కోసం తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడ్డానని, మంగళవారం కోర్టు కొట్టి వేస్తూ తీర్పు ఇవ్వడం ఎంతో ఆనందమన్నారు.
