Crime

అమలాపురంలో పీ.డీ.ఎస్. బియ్యం పట్టువేత…!!!

WhatsApp Image 2024-02-09 at 11.04.01 PM

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణములోని మార్కెట్ వీధిలో గల డోర్ నెం. 2-4-63/2 నందు పి.డి.ఎస్‌. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించి విశ్వసనీయ సమాచారంపై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సదరు ఇంటిని తనిఖీ చేసారు. ఆ తనిఖీల్లో 24 బస్తాలలో 1200 కేజీల పి.డి.ఎస్‌. బియ్యాన్ని గుర్తించారు. పి.డి.ఎస్‌. బియ్యం అమలాపురం మండలంలోని నడిపూడి గ్రామానికి చెందిన అరిగెల వీరాంజనేయులుకి చెందిందిగా అధికారులు గుర్తించారు.

పీ.డీ.ఎస్. బియ్యంకు సంబందించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో సివిల్ సప్లయ్స్ అధికారులు, అమలాపురం అధికారులు రూ. 54,600/- లు విలువ గల 1200 కేజీల పి.డి.ఎస్‌ చౌక బియ్యాన్ని సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్ నాగ వెంకటరాజు, సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాధ రెడ్డి, అమలాపురం సి.ఎస్.డి.టి భారతి, హెడ్ కానిస్టేబుల్ జీవానందం కానిస్టేబుల్ వీరబాబు మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.