అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన కాపు సమ్మేళనంలో మంత్రి, అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి విశ్వరూప్, పార్లమెంటు అభ్యర్థి రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ… పోటీలో ఉన్న ఇరు పార్టీల అభ్యర్థుల గుణ గణాలను పరిశీలించి మంచి వ్యక్తికి ఓటు వేయాలని కాపు యువతకు మంత్రి విశ్వరూప్ విజ్ఞప్తి చేశారు. నేను అందరివాడిని… అన్ని కులాల ను సమదృష్టితో చూస్తా… కాపులకు రావాల్సిన వాటా పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తానని విశ్వరూప్ హామీనిచ్చారు. సభలో పాల్గొన్న కాపు నాయకులు మాట్లాడుతూ… కాపులంటే జనసేన గా జమకడుతున్నారని ఇది తప్పని వైసిపి లో కూడా కాపులు ఎక్కువ ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వై.సీ.పీ. కి కాపు ఓటింగ్ పెంచడానికి కృషి చేస్తామని, పదవుల పంపకంలో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి విశ్వరూప్ కు విజ్ఞప్తి చేశారు.
అమలాపురంలో కాపు సమావేశాన్ని నిర్వహించి విశ్వరూప్…

