అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉన్నట్టు డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలియజేశారు. ఈ నిబంధన 30 నవంబర్ 2023 వరకూ అమలులో ఉంటుందని వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు జరపరాదని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్టైతే శిక్షార్హులవుతారన్నారు. ప్రత్యేకంగా ఈ నిబంధన 1) అమలాపురం టౌన్, 2) అమలాపురం తాలూకా, 3) అల్లవరం, 4) ఉప్పలగుప్తం, 5) ముమ్మిడివరం, 6) ఐ. పోలవరం, 7) కాట్రేనికోన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు వర్తిస్తుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజానీకం సహకరించవలసిందిగా ఆయన కోరారు.
అమలాపురం సబ్ డివిజన్లో సెక్షన్ 30 అమలు…

