అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ స్వతంత్ర అబ్యర్దిగా పరమట శ్యామ్ కుమార్ బుదవారం నామినేషన్ వేసారు. శ్యామ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నలు మూలల నుండి బారీ ఎత్తున స్వతహాగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. సమనాస గ్రామం నుండి అమలాపురం అర్డిఓ కార్యాలయానికి నామినేషన్ వేయ్యడాని కార్యకర్తల కోలాహలంతో, అభిమానుల హర్షధ్వానాలతో భారీ ఉరిగింపుగా తరలిరావడంతో అమలాపురం దద్దరిల్లింది. చైతన్య రథంపై ఊరేగింపుగా అర్డిఓ కార్యాలయానికి వస్తున్న శ్యామ్ కుమార్ కు జనం నీరాజనాలు పట్టారు. అర్డిఓ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారినికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తన కోసం వచ్చిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు.
అమలాపురం అసెంబ్లీ స్వతంత్ర అబ్యర్దిగా పరమట శ్యామ్ కుమార్ నామినేషన్…

