Political

అభివృద్ధి-సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం… -నాదెండ్ల మనోహర్-

WhatsApp Image 2024-01-29 at 10.13.57 AM

ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… వై.సీ.పీ. విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు.

రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జాడలు మాత్రం కనబడడం లేదన్నారు. ఇప్పుడు సిద్ధం.. సిద్ధం అంటూ ఎన్నికలు అంటే ఏదో యుద్ధ వాతావరణం అన్న భావన కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఎన్నికల ముందే వై.సీ.పీ. ప్రభుత్వం యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది. పొన్నూరు నియోజకవర్గంలో నిర్వహించే చంద్రబాబు నాయుడు రా.. కదలిరా.. సభలో జనసేన శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.