అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ రాతి ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఆశీర్వాదం అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బాప్స్ హిందూ మందిర్ శాస్త్రీయ సాంకేతికతలతో కూడిన పురాతన నిర్మాణ పద్ధతులను ఉపయోగించి నిర్మించారని అన్నారు. అబుదాబిలో బాప్స్ స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు ఆశీర్వదించబడ్డానన్నారు.
తనకు ఎంతో చారిత్రాత్మకమైన క్షణమని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో నటులు వివేక్ ఒబెరాయ్, దిలీప్ జోషి, గాయకుడు శంకర్ మహదేవన్ మరియు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్ కూడా వేడుకకు హాజరయ్యారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి సమీపంలోని అల్ రహ్బా సమీపంలోని అబు మ్రీఖాలో 27 ఎకరాల స్థలంలో సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారని వెళ్లడించారు.

