అనుమానస్పద రీతిలో మలయాళ చిత్ర నిర్మాత ప్రకాష్ కొలేరి వాయనాడ్‌లోని తన ఇంట్లో శవమై కనిపించారు. ప్రకాష్ కొలేరి 1987లో మిజియితలిల్ కన్నీరుమయి చిత్రానికి దర్శకత్వం వహించి పరిశ్రమలోకి ప్రవేశించారు. మంగళవారం కేరళలోని వాయనాడ్ జిల్లాలోని తన ఇంటిలో శవమై కనిపించారు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని విచారణకు తరలించారు. కొలేరి తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడని, రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల స్థానికులకు, బంధువులకు అనుమానం వచ్చిందని పోలీసులు విచారణలో తెలిపారు. దానితో అతని ఇంటిలోకి చొరబడగా అతను చనిపోయి కనిపించారని వెళ్లడించారు. ఈ ఘటనపై కెనిచిర పోలీసులు మరింత విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
అనుమానస్పద రీతిలో మలయాళ చిత్ర నిర్మాత ప్రకాష్ శవం…

