అనంతపురం జిల్లాలో టీడీపీ ఇన్‍ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో శంఖారావం మహా సభను నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రంపేట లో ఏర్పాటు చేసిన శంఖారావం మహా సభా ప్రాంగణానికి భారీగా టీడీపీ-జనసేన శ్రేణులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్ కు దిశనిర్దేశం చేసారు.
బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేస్తామని చెప్పారు. సభ ముగిసిన అనంతరం మధ్యాహ్నం తాడిపత్రి శంఖారావం సభకు హాజరుకానున్నట్లు లోకేష్ తెలిపారు. తాడిపత్రి సభతో మలివిడత శంఖారావం సభ ముగియనుందని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగురోజుల పాటు 10 నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర సాగిందని అన్నారు.

