Exclusive

అధికజన మహాసంకల్ప సభ విజయవంతం చేయండి…!!!

WhatsApp Image 2024-02-13 at 10.00.36 AM

గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణం నందు ఫిబ్రవరి 14 వ తేదీన అధికజన మహాసంకల్ప సభ నిర్వహిస్తునట్లు డాక్టర్ పి.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ., మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ సందర్బంగా ఆయనల మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఐ.ఏ.ఎస్. ఉద్యోగాన్ని సైతం వదిలి జనాలలోకి వచ్చిన విజయన్న మహాసంకల్ప సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీ.సీ., మైనార్టీ, ఓ.సి. వర్గాలలోని పేదలు తరతరాలుగా పేదరికం అనుభవిస్తూ అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారని అన్నారు.

స్వతంత్రం అనంతరం 8 దశాబ్దాలుగా కూటి, గుడ్డ, గూడు కోసం అలమటిస్తూ బ్రతుకుతున్నారని ఇటువంటి వారి జీవితాల మార్పు కోసం, వారి బ్రతుకులు మార్చాలనే ఉద్దేశంతో వచ్చిన విజయ్ కుమార్ ఈ సభను నిర్వహిస్తున్నారన్నారు. విజయ్ కుమార్ ఐక్యత విజయపథం యాత్రను ప్రారంభించి 142 రోజులు, 2,729 కిలోమీటర్లు నడిచి 12 జిల్లాలలో 1250 గ్రామ, పట్టణ, నగరాలు తిరిగి పేద ప్రజల దీనగాధలను ప్రత్యక్షంగా చూసారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.