Exclusive

అత్యవసర మందులపై జీ.ఎస్.టీ. తొలగించాలి…

WhatsApp Image 2024-02-05 at 2.03.10 PM

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం నందు ఏడో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా కాకినాడ నగర అధ్యక్షులు స్వామి మరియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ వెంకన్న మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేసి, యధావిధిగా 44 కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. సామాన్య ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మందులపై మరియు వైద్య పరికారాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశాలలో ఉద్యోగులు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై భవిష్యత్తు పోరాటాలను రూపొందిస్తామని తెలిపారు. చివరి రోజు జరిగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటివ్ యూనియన్ రాష్ట్ర జనరల్ కాన్ఫరెన్స్ కు ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బీ.హెచ్. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి వర్మ, చరణ్, సతీష్, శ్రీనివాస్, నరేష్, హసన్, పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.