ఫైబర్ బోటులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ డిఎస్పి, కాట్రేనికోన పోలీస్ సిబ్బంది, ఎస్ఈబి సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం గోదావరి నది పాయలో ఫైబర్ బోటులో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకొని పోలీసులు సీజ్ చేసారు.
అందులో 1079 బాటిల్స్, 259 లీటర్ల సుమారు లక్ష 25 వేల రూపాయల విలువ చేసే ఎన్డిపిఎల్ అక్రమ మద్యం సీజ్ చేసినట్లు ముమ్మిడివరం సీఐ కొండయ్య తెలిపారు. అక్రమ మద్యాన్ని నిల్వ ఉంచిన బోట్ ఎవరిది, ముద్దాయలు ఎవరు, యానంలో ఏ ఏ షాపుల్లో మద్యాన్ని కొనుగోలు చేశారో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా యానం లో కొనుగోలు చేస్తున్న వారిపై అమ్మిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించి రిమాండ్ కి పంపిస్తామని హెచ్చరించారు.
